‘వీరంతా సిండికేట్‌గా ఏర్పడి ఆక్వా రంగాన్ని పాడు చేశారు’

25 Nov, 2022 15:51 IST|Sakshi

శ్రీకాకుళం:  చంద్రబాబుకు పెట్టుబడి పెట్టే పెట్టుబడిదార్లు ఆక్వా రంగంలో స్థిర పడ్డారని, వీరంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి వ్యవస్థను పాడు చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. చంద్రబాబు వదిలి వెళ్లిపోయిన రూ. 330 కోట్ల బకాయిలను సైతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించిందన్నారు.

శుక్రవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన మంత్రి అప్పలరాజు.. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఆక్వారంగానికి 2వేల ఆరువందల కోట్ల రూపాయిలు పవర్ సబ్సిడీ చెల్లించాం. సీఎం జగన్‌ తన పాదయాత్రలో యూనిట్‌ విద్యుత్‌ రూపాయిన్నరకు ఇస్తామన్న తర్వాత, చంద్రబాబు రెండు రూపాయిలు అని ప్రకటించి ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు.  ఆక్వా రైతులను ఆదుకుంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన కాలంలో రూపాయిన్నరకు విద్యుత్‌ ఎందుకు  ఇవ్వలేదు.

ఆక్వా ప్రాసెస్‌, సీడ్‌ మిల్లర్‌లు వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామని అంటున్నారు.. దీనికి సంబంధించి ఒక్కరితోనైనా మాట్లాడించగలరా. చంద్రబాబుకు పెట్టుబడి పెట్టే పెట్టుబడి దార్లు ఆక్వారంగంలో స్థిరపడ్డారు. వీరంతా ఒక సిండికేట్‌గా ఏర్పడి వ్యవస్థను పాడుచేసారు. ఆక్వారంగంలో మాఫియా ను సీఎం జగన్ ఆడ్డుకోకపోతే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆక్వారంగం కుదేలు అయిపోయేది.  ప్రపంచంలో ఆర్దిక మాంద్యం, ప్రపంచ మార్కెట్ ధరల నేపధ్యంలో ఎగుమతులు తగ్గాయి. ప్రతికూల పరిస్థితుల్లో సీఎంజగన్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడింది. ఆక్వా ఎగుమతిదార్లకు ఎదరువతున్న సమస్యలు పరిష్కారానికి కమిటీ వేసి సమీక్ష చేస్తున్నాం. ఆక్వా రంగంలో సంస్కరణలు తెచ్చి చట్టాలు చేశాం.చంద్రబాబు పాలనలో ఆక్వారంగం స్టేక్ హోల్డర్స్ తో ఎప్పుడైనా మాట్లాడారా’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు