చంద్రబాబు చరిత్ర హీనుడు..

29 Dec, 2020 15:56 IST|Sakshi

మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

సాక్షి, పశ్చిమగోదావరి: పేదల ఇళ్ల పట్టాలను అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని  రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. ఆచంట నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటి విడతలో భాగంగా రెండవ రోజు పెనుగొండ, దొంగగూడెం, మునమర్రు రోడ్ , వడలి గ్రామాల్లో 1,194 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. (చదవండి:  ‘సినిమాల్లో వకిల్‌ సాబ్‌.. బయట పకీర్‌ సాబ్‌’)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టాలివ్వడమే కాకుండా.. ఇళ్లు నిర్మించుకునేందుకు లక్షా ఎనభై వేల రూపాయలు మంజూరు చేస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తిలో 15 వేల మందికి ఒకే చోట ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. పేదలకు ఇళ్ల పట్టాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లు అనుభవం ఉందంటూ హైకోర్టులో వేలాది కేసులు వేసి, 25న పేదలకు పట్టాలు ఇస్తుంటే 24 తేదీన కూడా కోర్టులో స్టే వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కతుందని ఆయన ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్క సెంటు భూమి కూడా సేకరించి అవ్వలేని చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శలు గుప్పించారు (చదవండి: ‘అది చిడతల నాయుడికే చెల్లింది’)

అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలతో 7 వేల కోట్లతో ప్రతి ఇంటికి విద్యుత్‌, మంచినీటి ట్యాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆచంట నియోజకవర్గంలో 54 వేల కుటుంబాలు ఉంటే, 18 వేల ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 68 వేల ఎకరాల్లో భూమిని 12 వేల కోట్ల రూపాయల భూముల లే అవుట్‌లు నిర్మించి ఇచ్చామన్నారు. 175 నియోజకవర్గంలో కూడా ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు