అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం 

21 Sep, 2020 15:23 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధం.. కొన్ని దుష్ట శక్తుల పనని, ఆ ఘటనపై పోలీసు విచారణ జరుగుతోందని మంత్రి శ్రీ రంగనాథ్‌ రాజు తెలిపారు. త్వరలోనే రథం దగ్ధం చేసిన కుట్రదారులను పట్టుకుంటామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులకు కులాలు, మతాలు ఉండవన్నారు. నారా చంద్రబాబు నాయుడు హయాంలో గుళ్లను కూల దోస్తే ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

చదవండి : దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు