మహిళల అభ్యున్నతే ధ్యేయం: సుచరిత

22 Sep, 2020 15:15 IST|Sakshi

వట్టిచెరుకూరులో ‘వైఎస్సార్‌ ఆసరా’ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి 

సాక్షి, గుంటూరు: మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం వట్టిచెరుకూరులో ‘వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమంలో పాల్గొన్న సుచరిత.. డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర సమయంలో మహిళల కష్టాలు స్వయంగా చూశారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ  పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. (చదవండి: ఇక నుంచి పోలీస్‌ సేవలు సులభతరం..)

వైఎస్సార్‌ చేయూత, ఆసరా, పావలా వడ్డీ, ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్‌.. మహిళలను లక్షాధికారిగా చూడాలని కలగన్నారని, నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ నిజం చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలను త్వరలోనే మహిళల పేరు మీద పంపిణీ చేయనున్నామని మంత్రి సుచరిత వెల్లడించారు. (చదవండి: ‘కుట్రలోనే భాగంగానే చంద్రబాబు లేఖ’)

>
మరిన్ని వార్తలు