ప్రజలకు చేరువలో ఏపీ పోలీస్‌: సుచరిత

21 Sep, 2020 14:38 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘‘ఏపీ పోలీస్‌ సేవా యాప్‌’’ను రూపకల్పన చేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఈ యాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండానే సేవలు పొందే విధంగా యాప్ రూపకల్పన చేశామని చెప్పారు. దిశ వంటి చట్టాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు విషయాల్లో ఏపీ పోలీస్ పలు ప్రశంసలు పొందిందని తెలిపారు. మరోమారు ప్రజలకు చేరువలో ఏపీ పోలీస్‌ పనిచేయనుందన్నారు. మహిళా భద్రత విషయంలో ‘దిశ’ యాప్‌తో పాటు ఈ యాప్ కూడా పనిచేస్తుందని సుచరిత వెల్లడించారు. (చదవండి: పోలీసులంటే భయం వద్దు: సీఎం జగన్‌) 

అందుబాటులోకి 87 సేవలు:డీఐజీ పాల్‌ రాజ్‌
పోలీస్‌ సేవా యాప్‌ ద్వారా  ప్రజలకు అందుబాటులో 87 సేవలను తీసుకువచ్చామని డీఐజీ పాల్‌ రాజ్‌ చెప్పారు. ఫిర్యాదు నుంచి కేసు ట్రయిల్‌ స్టేటస్‌ వరకూ యాప్‌ ద్వారా అప్‌డేట్‌ ఉంటుందన్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు రసీదు కూడా ఈ యాప్‌లోనే  ఉంటుందని పేర్కొన్నారు.మహిళ రక్షణ, చోరీలు, రోడ్డు భద్రత వంటి అనేక అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదు దారులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చే అవసరం లేకుండా యాప్‌ ఉపయోగపడుతుందని పాల్‌ రాజ్ వెల్లడించారు. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్‌ సరికొత్త యాప్‌)

మరిన్ని వార్తలు