సాంప్రదాయబద్ధంగా పీఠాధిపతి ఎంపిక: వెల్లంపల్లి

13 Jun, 2021 12:32 IST|Sakshi

బ్రహ్మంగారి మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా మాకు అందలేదు

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: బ్రహ్మంగారి మఠాధిపతులుగా 11 మంది పనిచేశారని.. మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా తమకు అందలేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఆయన బ్రహ్మంగారి మఠం వివాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సమాలోచనలు జరిపారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం 90 రోజుల్లో వీలునామా అందించాలని.. వీలునామా అందనందున ధార్మిక పరిషత్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

మఠం నిర్వహణకు తాత్కాలిక అధికారిని నియమించామని ఆయన చెప్పారు. మఠం ఆచారాలు, సంప్రదాయాలను త్వరితగతిన సేకరిస్తామని పేర్కొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.

చదవండి: వీడని ‘పీఠ’ముడి!
నేడు, రేపు భారీ వర్షాలు 

మరిన్ని వార్తలు