‘రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం’

2 Jan, 2021 19:09 IST|Sakshi

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి దేవుడి పట్ల భయం, భక్తి లేదని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాలపై దాడులు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ‘‘బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన దుర్మార్గుడు ఆయన. చంద్రబాబును ఓడిపోయేలా చేసింది వెంకటేశ్వరస్వామియే.(చదవండి: ‘రామతీర్థం’ చైర్మన్‌ పదవి నుంచి గజపతిరాజు తొలగింపు)

చంద్రబాబు రామతీర్థం వెళ్లి అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఘటనపై రామతీర్ధం ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు ఎందుకు స్పందించలేదు?. రామతీర్ధం ఘటనలో చంద్రబాబు హస్తం ఉంది. దేవుడు ఆస్తులను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టారు. ప్రత్యక్ష ఎన్నికల్ల ఓడిపోయి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన వ్యక్తి లోకేష్‌. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం. త్వరలోనే ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేయడం ఖాయం. చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష పడే రోజు దగ్గర్లోనే ఉందని’’ మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.(చదవండి: పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..)

అసాంఘిక శక్తులను నియంత్రించాలి: స్వరూపానందేంద్ర సరస్వతి
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శనివారం.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో మాట్లాడారు. అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ ప్రతిష్టతోపాటు హిందువుల మనోభావాలను దెబ్బతీసే కుట్రలను నిరోధించాలన్నారు. ఆలయాల భద్రత విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను సైతం అప్రమత్తం చేయాలని కోరారు. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్న సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు