దేవుడి ఆలయాన్ని సర్కస్‌ కంపెనీ అంటారా..?: మంత్రి వెల్లంపల్లి

22 Dec, 2021 11:26 IST|Sakshi

సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు వీరంగం సృష్టించడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?.

రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్‌గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. 

చదవండి: (రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం)

మరిన్ని వార్తలు