'యాస్‌' తుపాను అప్రమత్తతపై మంత్రి వెల్లంపల్లి సూచనలు

23 May, 2021 22:16 IST|Sakshi

ఫోన్‌లో కలెక్టర్‌కు సూచన‌లు ఇచ్చిన మంత్రి వెల్లంప‌ల్లి

సాక్షి, విజయనగరం: ‘యాస్‌’ తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అదేశించారు. ఈ మేరకు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ‌య‌న‌గ‌రం జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌కు ఫోన్‌లో సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని అధికారులకు ఆదేశించారు. చెరువులకు గండ్లు కొట్టకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

చదవండి: అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

మరిన్ని వార్తలు