భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ

13 Oct, 2021 11:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు బుధవారం దర్శించకున్నారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ.. 'అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించా. మంగళవారం మూలా నక్షత్రం రోజున లక్ష మందికి పైగా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చినా చివరి భక్తుడి వరకు దర్శనం కల్పించాము. అందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని మంత్రి వెల్లంపల్లి అన్నారు.  

భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని డీజీపీ గౌతమ్‌ వాంగ్‌ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పొందారు. దర్శనానంతరం డీజీపీ మాట్లాడుతూ.. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి. దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీసులందరికీ నా కృతజ్ఞతలు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సీపీ బత్తిన శ్రీనివాసులు ముందుండి జరిపించడం చాలా సంతోషకరంగా ఉంది' అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

చదవండి: (ఇంద్రకీలాద్రిపై వర్షం.. భక్తుల హర్షం)

మరిన్ని వార్తలు