అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు

1 Feb, 2021 11:30 IST|Sakshi

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలంటూ దిక్కుమాలిన కమిటీలు వేశారని, ఇప్పుడు ఆ కమిటీలు లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆయన నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్‌లో పర్యటించారు. (చదవండి: ‘ఎవరెన్ని డ్రామాలు చేసినా.. గెలుపు మాదే’)

స్థానికులు నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పాటి సమస్యలను మంత్రి.. అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కోర్టులో కేసులు పరిష్కారం అయిన వెంటనే అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు.(చదవండి: కాపీల రాయుడు.. చంద్రబాబునాయుడు)

రామ మందిర నిర్మాణానికి రూ.5లక్షల విరాళం..
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వ్యక్తిగతంగా రూ.5,01,116 విరాళం అందజేశారు. సంబంధింత చెక్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర ముఖ్యులు భరత్‌కు ఆయన ఆదివారం అందజేసినట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు