రేపు ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభం: మంత్రి

11 Aug, 2020 15:19 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రేపు(బుధవారం) ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నేరుగా ఏడాదికి 18,750 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. అంటే నాలుగేళ్ళలో 75 వేల రూపాయలు వారికి ఆర్థిక సహయం అందనుందన్నారు.  

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ఈ ఏడాది 4 7 00 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా..  సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని, చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కోవిడ్ నియంత్రణకు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అవలంభిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు