రుయా ఆసుపత్రి ఘటనపై  స్పందించిన మంత్రి రజిని

26 Apr, 2022 15:57 IST|Sakshi

సాక్షి, గుంటూరు: తిరుపతిలోని రూయా ఆసుపత్రి అంబులెన్స్‌ ఘటనపై అధికారులను వివరణ కోరామని, విచారణకు ఆదేశించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రమని, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ప్రైవేటు వ్య‌క్తులు బెదిరించారా..? ఆస్ప‌త్రి సిబ్బందే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారా.. అనే కోణంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు.
చదవండి👉: తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్‌ దందా..

మ‌హాప్ర‌స్థానం అంబులెన్స్‌లు  24 గంట‌లూ ప‌నిచేసేలా త్వ‌ర‌లోనే ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు. ప్రీపెయిడ్ ట్యాక్సుల విష‌యాన్ని ప‌రిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో మృత‌దేహాల‌ను వీలైనంత‌ వ‌ర‌కు మ‌హాప్ర‌స్థానం వాహ‌నాల ద్వారానే ఉచితంగా త‌ర‌లించేలా చ‌ర్య‌లు తీసుకుంటామని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మృతుల కుటుంబ‌స‌భ్యులే నిర్ణ‌యం తీసుకునేలా చూస్తామన్నారు. అన్ని ఆస్ప‌త్రుల్లో ప్రైవేటు అంబులెన్సుల‌ను నియంత్రిస్తామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు