రైతులకు ఉపయోగపడే విధంగా సీఎం నిర్ణయం

6 Oct, 2020 16:18 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: తాండవ షుగర్ ఫ్యాక్టరీలో మంగళవారం మంత్రులబృందం రైతులతో సమావేశమయ్యింది. తాండవ షుగర్ ఫ్యాక్టరీపై రైతుల అభిప్రాయాలను మంత్రుల బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం మంత్రి అవంతి  శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  రైతుల పక్షపాతి. సీఎం జగన్ చంద్రబాబులాగా ఎన్నికల కోసం పనిచేయరు. షుగర్ పరిశ్రమల్లో స్థితిగతులు ప్రత్యక్షంగా తెలుసుకోమని సీఎం కమిటీ వేశారు. రైతులకు నష్టం చేయడం కోసం కమిటీ వేయలేదు. మీరు చెప్పిన అభిప్రాయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం. అందరికి మేలు జరిగే నిర్ణయం సీఎం జగన్‌ తీసుకుంటారు’ అని వెల్లడించారు. 

అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి మాట్లాడుతూ, ‘ రాష్ట్రంలో 12 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోమని సీఎం చెప్పారు. రైతులకు సీఎం జగన్‌ మేలు చేస్తారు. రైతులకు మేలు జరగాలన్నదే సీఎం జగన్‌ ఉద్దేశం’ అని తెలిపారు.  వ్యవసాయ శాఖ మంత్రి  కన్నబాబు మాట్లాడుతూ, ‘నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్‌ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు మంచే జరుగుతుంది. మీ అభిప్రాయాలను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాం’ అని పేర్కొన్నారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ‘వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ మోహన్ రెడ్డి  ఉన్నపుడు రైతులకు మేలు జరిగింది. రైతులకు సీఎం జగన్‌ ఏం చేశారో, చంద్రబాబు ఏం చేశారో అందరికి తెలుసు. రైతుల అభిప్రాయాలన్నింటిని  సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. రైతులకు మేలు చేయాలన్నదే సీఎం జనగ్‌ ఆలోచన. టీడీపీ హయాంలో చెరుకు రైతులకు బకాయి ఉన్న రూ.54 కోట్లును సీఎం జగన్ విడుదల చేశారు’ అని  చెప్పారు. ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, ‘ షుగర్ పరిశ్రమల స్థితిగతులు తెలుసుకోవాలని సీఎం కమిటీ వేశారు. నష్టం వస్తే ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కమిటి చర్చిస్తోంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించారు. రైతులకు మేలు జరగేలా మంత్రుల కమిటీ నిర్ణయం ఉంటుంది’ అని అన్నారు.

చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు