మిర్చి అ‘ధర’హో !

28 Dec, 2022 05:54 IST|Sakshi
మార్కెట్‌కు భారీగా వచ్చిన ఎండుమిర్చి

గరిష్ట ధర రూ.37,112, మోడల్‌ ధర రూ.18,009

కర్నూలు(అగ్రికల్చర్‌): మిర్చి ధర పరుగులు తీస్తున్నది. మంగళవారం కర్నూలు మార్కెట్‌కు 207 మంది రైతులు 295 క్వింటాళ్ల ఎండుమిర్చి తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.4,119, గరిష్ట ధర రూ.37,112, మోడల్‌ ధర రూ.18,009గా నమోదు అయ్యింది.  కర్నూలు మార్కెట్‌ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.37,112 ధర లభించడం విశేషం. ఈ నెల 24న మార్కెట్‌లో గరిష్ట ధర రూ.33,102 లభించింది.

మూడు రోజుల్లోనే క్వింటాలుపై రూ.4,010 పెరగడం విశేషం. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.25 లక్షల ఎకరాల్లో ఎండుమిర్చి సాగయింది. కర్నూలు మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ నెల 24న మార్కెట్‌కు 135 క్వింటాళ్లు మాత్రమే రాగా.. ఈ నెల 27న 295 క్వింటాళ్ల మిర్చి వచ్చింది.  

మరిన్ని వార్తలు