మిసెస్ ఉత్తరాంధ్రగా భాగ్యలక్ష్మి
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): మిస్ అండ్ మిసెస్ ఉత్తరాంధ్ర–2022 గ్రాండ్ ఫైనల్స్ ఆదివారం ఘనంగా జరిగాయి. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో యువతలు, మహిళలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.
సంప్రదాయ వస్త్రాలు ధరించి, క్యాట్ వాక్ చేస్తూ అదరహో అనిపించారు. ఫైనల్స్‌లో 20 మంది పాల్గొనగా మిస్ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి, మిసెస్ ఉత్తరాంధ్రగా భాగ్యలక్ష్మి నిలిచారు. విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ బహుమతులు అందజేశారు.