మిస్‌ వైజాగ్‌–2021గా కిరీటం దక్కించున్న సృజిత

13 Oct, 2021 10:22 IST|Sakshi
విన్నర్‌ సృజితతో ప్రథమ రన్నర్‌ ముస్కాన్‌ నయ్యర్, ద్వితీయ రన్నర్‌ చరిష్మా కృష్ణ 

సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): మిస్‌ వైజాగ్‌–2021గా సృజిత కిరీటం దక్కించుకుంది. క్రియేటివ్‌ ప్లస్‌ ఆధ్వర్యంలో ఆదివారం మిస్‌ వైజాగ్‌ గ్రాండ్‌ ఫైనల్‌ నిర్వహించగా... విజేతలను మంగళవారం ప్రకటించారు. మొత్తం 21 మంది మిస్‌ వైజాగ్‌ కిరీటం కోసం పోటీ పడినట్టు ఈవెంట్‌ నిర్వాహకుడు అజయ్‌ తెలిపారు. ప్రథమ రన్నర్‌గా ముస్కాన్‌ నయ్యర్, ద్వితీయ రన్నర్‌గా చరిష్మా కృష్ణ నిలిచారు. వీరితో పాటు వివిధ విభాగాల్లో మరో 11 మందికి టైటిల్స్‌ అందజేశారు. మిస్‌ సోషల్‌ మీడియా క్వీన్‌గా పవిత్ర, మిస్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా ముస్కాన్‌ నయ్యర్, మిస్‌ ఫొటోజెనిక్‌గా నేహా జమేలు, మిస్‌ బ్యూటిఫుల్‌ హెయిర్‌గా సంధ్య, మిస్‌ గ్లోయింగ్‌ స్కిన్‌గా నేహా గుప్తా, మిస్‌ బ్యూటిఫుల్‌ ఐస్‌– పవిత్ర, మిస్‌ షైనింగ్‌ స్టార్‌– చరిష్మా, మిస్‌ గుడ్‌ నెస్‌ అంబాసిడర్‌– బోర్నిట, మిస్‌ ఫర్ఫెక్ట్‌ ర్యాంప్‌ వాక్‌– తారా, మిస్‌ గ్లామరస్‌ క్వీన్‌– రుచితారెడ్డికి టైటిల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా విజేతలు ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు. 

మరిన్ని వార్తలు