అభివృద్ధి తెలియని నేతలకు విమర్శించే అర్హత లేదు: అనిల్‌కుమార్‌

17 Sep, 2022 20:41 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: రామలింగాపురం ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని సంక్రాంతి పండుగకు ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌ పనులు ఆలస్యం అయ్యాయి. ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తోంది. అక్టోబర్‌ 10న పెన్నా నదిలో మరో వంతెనకు శంకుస్థాపన చేయబోతున్నాం. ఐదేళ్ల పాలనలో టీడీపీ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది శూన్యం. అభివృద్ధి తెలియని నేతలకు విమర్శించే స్థాయి లేదు అని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.

చదవండి: (ఆ విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరాం: మంత్రి అమర్నాథ్‌)

మరిన్ని వార్తలు