‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’

1 Sep, 2020 11:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా సంకల్పయాత్రతో జనం చెంతకు చేరిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా నేతగా ఎదిగారు. అధికారాన్ని చేపట్టిన కొద్ది కాలంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు. విద్యతోనే ముందడుగు అని విశ్వసించి అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా వసతి వంటి పథకాలను అమలు చేస్తున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని సమూలంగా మార్చేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ని చిన్నారులు మావయ్య అంటూ సంబోధిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కొందరు చిన్నారులు ‘బంగారు కొండవయ్య.. మా జగన్ మావయ్య’ అంటూ సాగే పాటను ఆలపించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. జగనన్న కోసం చిన్నారులు పాడిన మరో అద్భుతమైన పాట అంటూ ఆయన ఈ పాట ప్రొమోని షేర్‌ చేశారు. ప్రోమో విడుదలైందని, త్వరలోనే పాట విడుదల చేస్తామని చెప్పారు.
(చదవండి: సుపరిపాలన వైఎస్‌ సంతకం)

>
మరిన్ని వార్తలు