కులవివక్ష లేదు.. అవి అసత్య రాతలు: చెన్నకేశవరెడ్డి

18 Jul, 2021 18:40 IST|Sakshi

కర్నూలు: గురజాలలో కులవివక్షపై ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్పందించారు. గురజాలలో కులవివక్ష చూపుతున్నారనడం సరికాదని ఆయన అన్నారు. కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు రాస్తున్నారని చెన్నకేశరెడ్డి విమర్షించారు.

కేవలం చర్చి గోడ విషయంలోనే రెండువర్గాల మధ్య వివాదం జరిగినట్లు పేర్కొన్నారు. గతంలో ఆడమ్‌స్మిత్‌ పరువుహత్యకు, ఈ విషయం ముడిపెట్టడం సరికాదని, గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు