ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వం: చంద్రబాబు గ్రామంలోనూ..

27 Apr, 2021 19:45 IST|Sakshi

రూ.25 లక్షల సొంత నిధులతో ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు

తిరుపతి : మహమ్మారి కరోనా వైరస్‌ బాధితుల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ముందుకు వచ్చారు. కరోనా బాధితుల కోసం తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి పరిధిలో మొత్తం రూ.25 లక్షల వ్యయంతో ఏకంగా 150 ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కేర్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు సిద్దం అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 

చంద్రగిరిలో 100 బెడ్లు, 500 పడకలతో చంద్రగిరిలోనే మరొక కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో 50 బెడ్లు ఏర్పాటు చేస్తుండడం విశేషం. ప్రజలకు సత్వర కరోనా సేవలే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి దాతృత్వంపై నియోజకవర్గ ప్రజలతో పాటు చాలామంది అభినందిస్తున్నారు.

చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు
చదవండి: ‘బరాత్‌’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌

మరిన్ని వార్తలు