చెవిరెడ్డి ఇంట విషాదం..

21 Jan, 2021 12:52 IST|Sakshi

సాక్షి, తిరుపతి: చంద్రగిరి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు చెవి రెడ్డి హనుమంత రెడ్డి(45)మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతరెడ్డి గురువారం ఉదయం మరణించారు. రేపు తుమ్మలగుంటలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు