‘ఆ విషయం తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నాం’

7 Nov, 2020 16:01 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. శ్రీకాకుళంలో  శనివారం నాడు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒక ఎకరం భూమి కొని పేదవాడికి ఒక సెంటు భూమిని ఇండ్ల స్థలం కోసం ఇచ్చాడా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో రూ. 100 కోట్లు వెచ్చించి పేదల ఇండ్ల స్థలాల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి‌ భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అయినప్పటికి చంద్రబాబు తమ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్‌ పేదవాడి కన్నీరు తుడిచారు, అది వైఫల్యమా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రెండు లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమా? అని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, మహిళలు, రైతులు, యువతకు అనేక పధకాలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అని ధర్మాన తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర తరువాత సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఎటువంటి మార్పు జరిగిందో తెలుసుకోవడానికే పాదయాత్రల ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని ఆయన చెప్పారు. 

చదవండి: రైతులు రోడ్డున పడటానికి బాబే కారణం: సీపీఎం

మరిన్ని వార్తలు