ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా

23 Aug, 2020 12:54 IST|Sakshi

సాక్షి, గుంటూరు : నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనావైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి రావడంతో కోవిడ్‌ టెస్టులు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నానని, నెగెటివ్‌ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని అన్నారు. గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
(చదవండి : కరోనా భారత్‌: 30 లక్షలు దాటిన కేసులు)

మరిన్ని వార్తలు