‘దేశంలో అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయి’

5 Oct, 2020 14:23 IST|Sakshi

సాక్షి, కర్నూలు : వాలంటరీ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ఊరు ఊరు తిరిగి తెలుసుకొనేందుకు వైఎస్సార్ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ బైక్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి, పేదల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య, వైఎస్సార్‌ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉదయగిరి మహమ్మద్ షరీఫ్, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ('విశాఖ చరిత్రలో ఆ కుటుంబానికి ఓ పేజీ')

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. స్వలాభం కోసం చంద్రబాబు పని చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని, ఇదే ఆచరణకు సిద్ధమౌతున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఆశయ సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షేరిఫ్‌ చేపట్టిన యాత్రకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు తెలియజేసే విధంగా ఈ ప్రచార యాత్ర ముందుకు సాగాలని సూచించారు. (ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్‌ )

ప్రజా సంక్షేమ పథకాలను ఊరు ఊరు తిరిగి తెలుసుకొనేందుకు మహ్మద్ షరీఫ్‌ బైక్ యాత్ర చేపట్టడం సంతోషంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. ఆయనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభినందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేస్తున్నారన్నారు. వైఎస్‌‌ జగన్‌ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని, ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు