మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కళావతి

9 Jul, 2021 09:34 IST|Sakshi
క్షతగాత్రునికి వైద్య సేవలు చేయిస్తున్న ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది

సాక్షి,శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎటువంటి సాయం అందక కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రునికి పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సాయమందించారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో సీతంపేట మండలం పత్తికగూడ మీదుగా వస్తున్న ఎమ్మెల్యేకు రహదారి పక్కన ప్రమాదానికి గురైన క్షతగాత్రుడు కనిపించాడు. అతడుపాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక రాంబాబుగా గుర్తించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న రాంబాబును  ఎమ్మెల్యే తన వాహనంలో వ్యక్తిగత సిబ్బంది ద్వారా బాధితున్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు. సిబ్బంది దగ్గరుండి చికిత్స చేయించారు.  

మరిన్ని వార్తలు