అయ్యా నా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే ఆస్పత్రికి కోటంరెడ్డి

19 Jun, 2022 10:31 IST|Sakshi
మాట్లాడుతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఓ వ్యక్తి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కి ఫోన్లో తెలియజేశారు. ఈ క్రమంలో ఆస్పత్రికి ఎమ్మెల్యే వెళ్లి మెరుగైన వైద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టారు. వివరాలు.. తన కుమారుడు సుల్తాన్‌ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని రామకోటయ్యనగర్‌కు చెందిన ఖాదర్‌బాషా ఎమ్మెల్యేకు శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఫోన్లో తెలియజేశారు.

చికిత్స పొందుతున్న బాధితుడు

ఈ క్రమంలో తన వాహనంలో ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మెల్యే.. ఖాదర్‌బాషాను కలిసి తానున్నానంటూ భరోసా ఇచ్చారు. సుల్తాన్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఏజీఎంతో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. దీంతో సత్వరమే వైద్యసేవలను అందించారు. 

చదవండి: (తాళి కట్టి రోజు గడవక ముందే.. నవ్వును దూరం చేసి దుఃఖాన్ని మిగిల్చి)

మరిన్ని వార్తలు