సంక్షేమ పథకాల ఘనత సీఎం జగన్‌దే

12 Sep, 2020 13:30 IST|Sakshi

‘వైఎస్సార్‌ ఆసరా’ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కరోనా కష్ట సమయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ‘వైఎస్సార్‌ ఆసరా’  పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు నగదును జమచేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. కమలాపురం వెలుగు కార్యాలయం ఆవరణలో ‘వైఎస్సార్‌ ఆసరా’ వారోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మెగా చెక్కును ఆయన పంపిణీ చేశారు. (చదవండి: అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా భరోసా)

ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్‌ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 3874 మహిళా సంఘాలకు మొదటి విడతగా 32 కోట్ల 47 లక్షల 81 వేల రూపాయలు లబ్ధి చేకూరింది. కమలాపురం మండలంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ కింద మొదటి విడతగా 800 మహిళా సంఘాలకు గాను 6 కోట్ల 53 లక్షల 29 వేల రూపాయల విలువ కలిగిన మెగా చెక్కును డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అందజేశారు. 

మరిన్ని వార్తలు