అంబులెన్స్‌ బైక్‌ నడిపిన ఎమ్మెల్యే రోజా 

7 Sep, 2020 08:18 IST|Sakshi

సాక్షి, నగరి : ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నగరిలోస్వ‌యంగా అంబులెన్స్‌ బైక్‌ నడిపారు. శ్రీసిటీ హీరో మోటార్‌ సంస్థ (నగరి).. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు రెండు అంబులెన్స్‌ బైక్‌లను ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతులమీదుగా ఆదివారం అందజేసింది. అనంతరం జెండా ఊపి వాటిని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో శ్రీసిటీ హీరో మోటార్స్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
వైఎస్‌ జగన్‌ దేశానికే ఆదర్శం
సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ )లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచార‌ని ఎమ్మెల్యే రోజా అన్నారు.  ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వీరిద్దరి అబద్ధాలకు చెంపపెట్టులా పారిశ్రామికవేత్తలు సీఎం వైఎస్‌ జగన్‌పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ ర్యాంకును కూడా టీడీపీ తమ ఘనతేనని చెప్పుకోవడం వారి చీప్‌ పాలిటిక్స్‌కు నిదర్శనం అని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. (వైద్య శాఖ అనుమతి రాగానే రోడ్డెక్కనున్న సిటీ బస్సులు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా