మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి 

17 Jul, 2021 13:24 IST|Sakshi
యువకుడికి ప్రథమ చికిత్స అందిస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

సాక్షి,ఎర్రగుంట్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహమ్మద్‌పీర్‌ అనే యువకుడిని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. మహమ్మద్‌పీర్‌ ఎర్రగుంట్ల మున్సిపల్‌ పరిధిలోని మెప్మా సంస్థలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా  పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం బైక్‌లో కార్యాలయానికి బయలుదేరాడు.రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పైన గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో   పడిపో యాడు. ఆ సమయంలో  కేజీవీ పల్లె గ్రామానికి వెళతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి చూసి కారు  దిగి క్షతగాత్రుడిని పరిశీలించారు. చేయి విరిగిపోవడంతో వెంటనే   ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ప్రొద్దు టూరు ఆసుపత్రికి పంపించారు.       

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు