ఎమ్మెల్సీ మాజీ కారు డ్రైవర్‌ భార్యకు ప్రభుత్వోద్యోగం 

21 Jun, 2022 08:07 IST|Sakshi

కాకినాడ సిటీ: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగమిచ్చారు. ఇటీవల సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) చట్టం కింద ఈమెకు ఉద్యోగమిస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా సోమవారం స్పందన కార్యక్రమంలో ఉత్తర్వులను అందజేశారు. అపర్ణ అర్హత ధ్రువపత్రాలను పరిశీలించి, కాంపేషనేట్‌ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎ.హనుమంతరావును కలెక్టర్‌ ఆదేశించారు. 

మరిన్ని వార్తలు