గిరిజన గ్రామాల వివరాలకో మొబైల్‌ యాప్‌

27 Sep, 2020 03:52 IST|Sakshi

గ్రామ ఆస్తులు, మౌలిక సదుపాయాలు తెలుసుకునే వీలు

అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన గిరిజన ఐటీ విభాగం 

సాక్షి, అమరావతి: గిరిజన గ్రామాల వివరాలు, మౌలిక సదుపాయాలు తెలుసుకునేందుకు వీలుగా మొబైల్‌ యాప్‌ను గిరిజన సంక్షేమ ఐటీ విభాగం రూపొందించింది. రోడ్లు, భవనాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మొదలైన అన్ని మౌలిక సదుపాయాలను, గ్రామాల్లోని అన్ని ఇతర ఆస్తులను ప్రభుత్వ విభాగాలు తెలుసుకునేందుకు ఈ మొబైల్‌ అప్లికేషన్‌ ఉపయోగపడుతుంది. 

► ఏపీ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఏపీసీఎఫ్‌ఎఫ్‌) గిరిజన గ్రామాలకు చెందిన మొత్తం సమాచారాన్ని ఆయా విభాగాల నుంచి సేకరించి క్రోడీకరిస్తుంది.
► త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. మొబైల్, కంప్యూటర్‌ సిస్టమ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
► ఈ యాప్‌లో గ్రామ ప్రొఫైల్‌లో జనాభా వివరాలు, గృహాలు, స్వయం సహాయక బృందాల సంఖ్య, పెన్షనర్ల సంఖ్య, సంక్షేమ సహాయకుడి పేరు, గ్రామ వలంటీర్ల సంఖ్య, వ్యవసాయ భూమి ఎన్ని ఎకరాలు ఉందనే వివరాలు ఉంటాయి. 
► ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొఫైల్‌లో 35 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అవి.. ఏపీఎస్‌ఆర్‌టీసీ, వ్యవసాయం, వినోదం, పాడి, పశుసంవర్థక, విద్య, విద్యుత్, ఫైబర్‌నెట్, ఫైనాన్స్, ఫైర్‌ స్టేషన్, ఫిషరీస్, ఫుడ్‌– సివిల్‌ సప్లైస్, ఫారెస్ట్, జీసీసీ, గ్యాస్‌ అండ్‌ పెట్రోల్, హెల్త్, హార్టికల్చర్, ఐటీడీఏ, ఇరిగేషన్‌ సోర్స్, జువెనైల్‌ వెల్ఫేర్, లేబర్‌ విభాగం, పంచాయతీ రాజ్, పోలీస్‌స్టేషన్, ఆర్టీఏ, రెవెన్యూ విభాగం, గ్రామీణ నీటి సరఫరా, సెర్ప్, స్వయం సహాయక బృందాలు, సెరికల్చర్, నైపుణ్యాభివృద్ధి, వసతి గృహాలు, టెలికాం, వెటర్నరీ, మహిళ– శిశు సంక్షేమం, ఇతర విభాగాలు.
► రహదారి కనెక్టివిటీ సమాచారంతో రహదారులను సంగ్రహించడానికి జియో ఫెన్సింగ్‌ సౌకర్యం ఉంది. డ్యాష్‌ బోర్డులో పూర్తి వివరాలు ఉంటాయి. 
► హెల్త్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా రోగులకు వైద్య సాయాన్ని అందించే అనువర్తనాన్ని ఈ అప్లికేషన్‌లో అభివృద్ధి చేశారు.  

మరిన్ని వార్తలు