మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్‌ మృతి

27 Jul, 2020 16:24 IST|Sakshi
ఫైల్ ‌ఫోటో

సాక్షి, అనంతపురం : మొద్దు శ్రీను హత్యకేసులో నిందితుడైన ఓం ప్రకాశ్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గతకొంత కాలంగా బాధపడుతున్న ఆయన.. సోమవారం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును 2008 నవంబర్ 9న జైలులోనే డంబుల్‌తో‌ కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఓం ప్రకాశ్‌ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ.. సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు.

ఓం ప్రకాష్ మరణవార్త తెలిసిన అతని కుటుంబ సభ్యులు విశాఖ చేరుకున్నారు. అతని తనయుడు సాయి కుమార్ తన తండ్రి ఇంకో కొంత కాలం జీవిస్తారని అనుకున్నానని ఊహించని రీతిలో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ పరీక్షలో నెగిటివ్ వస్తే సొంత ఊరు తీసుకుని వెళ్తామని అతని తనయుడు సాయి కుమార్ తెలిపారు. ఓం ప్రకాశ్‌ తల్లి సరోజనమ్మ కూడా అనారోగ్యంతో గత ఏప్రిల్ ‌మృతిలో మృతిచెందారు.

మరిన్ని వార్తలు