వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

23 Jun, 2021 05:31 IST|Sakshi

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక నెమ్మదిగా ఉంది. వారం, పది రోజల్లో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించే పరిస్థితి ఉందని, వర్షాలకు ఢోకా లేదని అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు