రెండు రోజులపాటు వానలు

27 Jul, 2021 03:30 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.

ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. దీని ప్రభావం వల్ల ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు