నేడు రాష్ట్రంలో తేలికపాటి వానలు

24 Sep, 2020 04:48 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్యప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాల్లో నేడు బలహీనపడనుంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో తిరిగి ఈశాన్య దిశలో పయనించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో 4 సెంమీ, అనకాపల్లి, భీమిలి, పోలవరంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు