కొనసాగుతున్న అల్పపీడనం

2 Nov, 2020 03:15 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం బంగ్లాదేశ్‌ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల 48 గంటల్లో  ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో అక్కడ అక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా ఆదివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు  రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. తునిలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.  

మరిన్ని వార్తలు