పుట్టెడు దుఃఖంలో ఉన్నా లంచం తప్పలేదు

25 Aug, 2020 09:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణజిల్లా మచిలీపట్నంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మృతదేహాన్ని అప్పగించాడానికి డబ్బులు ఇవ్వాల్సిందేనని మార్చురీ అటెండర్‌ డిమాండ్‌ చేశాడు. అసలే కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు లంచం ఇవ్వక తప్పలేదు. అయితే, ఆ అటెంటర్‌ లంచావతారం మొత్తం వీడియోలో రికార్డవడంతో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ నెల 21 సుమలలిత అనే వివాహితను ఆమె భర్త హత్య చేశాడు.

పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కూతురి మృతదేహం కోసం మార్చురీకి వెళ్లిన మృతురాలి తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. శవాన్ని ఇచ్చేందుకు మార్చురీ అటెండర్‌ రూ.6 వేలు లంచం డిమాండ్‌‌ చేశాడు. డబ్బులు ఇవ్వనిదే మృతదేహాన్ని అప్పగించేది లేదని స్పష్టం చేశాడు. చివరకు ఆ తల్లిదండ్రులు రూరూ.1500 ముట్టజెప్పారు. ఈక్రమంలో వారి బంధువులు అటెండర్‌ బాగోతాన్ని వీడియో తీసి వైరల్‌ చేశారు. మార్చురీ అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు