దోమల చక్రం బస్తాలకు అంటుకోవడంతో సజీవ దహనం..

30 Jul, 2021 10:40 IST|Sakshi

గుంటూరు: లంకెవాని దిబ్బ రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్నఒడిశాకు చెందిన ఆరుగురు కూలీలు సజీవ దహనమైన ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదని నిర్దారణ అయ్యింది. వీరంతా రాత్రి పడుకునేటప్పుడు బ్లీచింగ్‌ పౌడర్‌  బస్తాలపై దోమల చక్రం పెట్టి నిద్ర పోవడంతో అది అంటుకోవడంతోనే సజీవ దహనం అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాయిల్‌ ద్వారా బ్లీచింగ్‌ పౌడర్‌ బస్తాలకు మంటలు అంటుకునే వారు మృతిచెందినట్లు  స్పష్టత వచ్చింది. తొలుత ఈ ఘటనకు విద్యుత్‌ షాక్‌ కారణమని భావించారు.

కానీ ఆ తర్వాత అధికారులు దోమల చక్రంతో ప్రమాదం జరిగినట్లు తేలింది. కాగా, ప్రమాద స్థలానికి బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని విలపిస్తున్నారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ ఆధారంగా విచారణ చేపడతామని ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. అదేవిధంగా మృతులు ఒడిశాలోని రాయ్‌గఢ్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చెరువు యజమాని, సూపర్‌వైజర్‌లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ విశాల్‌ గున్ని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు