Badvel Bypoll: చరిత్రలో నిలిచేలా బద్వేలు మెజారిటీ

2 Oct, 2021 12:15 IST|Sakshi
మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, చిత్రంలో కడప మేయర్‌ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు అభ్యర్థి డాక్టర్‌ సుధ

కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

ఉప ఎన్నికపై నాయకులకు దిశానిర్దేశం

సాక్షి, బద్వేలు: బద్వేలు శాసనసభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ రానంత స్థాయిలో... చరిత్రలో నిలిచేలా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ మెజారిటీ సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అధ్యక్షతన  నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అవినాష్‌రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, అభ్యర్థి డాక్టర్‌ సుధ పాల్గొన్నారు.  ఎంపీ అవినాష్‌రెడ్డి  మాట్లాడుతూ ఓటింగ్‌ శాతం పెరిగేలా చూడాలన్నా రు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో ఓటింగ్‌ శాతం తగ్గడంతోనే మెజారిటీ తగ్గిందని, ఈ దఫా అటువంటి తప్పిదం జరగకుండా  పని చేయాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎం వైఎస్‌ జగన్‌పై నిత్యం బురద జల్లుతూ, ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నా తిరుపతిలో 2.70 లక్షలకుపైగా మెజారిటీ వచ్చిందంటే ఇందుకు ప్రజలు ప్రభుత్వం వెంట ఉండటమే కారణమని చెప్పారు.   

సీఎం జగన్‌ బద్వేలు అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారని చెప్పారు. బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులో నిరంతరం నీరు ఉండేలా తెలుగుగంగ కాలువను సున్నా నుంచి 18 కి.మీ. వరకు లైనింగ్‌ పనులు చేపట్టామని, దీంతో ఐదు వేల క్యూసెక్కులు ప్రవహించేలా అడ్డంకులు తొలగాయన్నారు. కుందూ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తే సాగు,తాగు నీటికి ఇక్కట్లు తీరతాయని చెప్పారు. బద్వేలు పెద్ద చెరువు ఎప్పుడూ నీటితో నిండేలా ఎల్లెస్పీ ఎడమ కాలువ విస్తరణ పనులు చేపడుతున్నామని చెప్పారు.  
రెవెన్యూ డివిజన్‌ రాజంపేటలో ఉండటంతో నియోజకవర్గ ప్రజలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బద్వేలులోనే డివిజన్‌ ఏర్పాటు చేసే గెజిట్‌ ఇచ్చారని, మరో నెల రోజుల్లో అన్ని అంశాలు పూర్తి చేసి ఇక్కడే డివిజన్‌ సిబ్బంది పని చేసేలా కార్యాలయం ప్రారంభిస్తామని వివరించారు.  
గోపవరం మండల పరిధిలో రూ.వెయ్యి కోట్లతో సెంచూరీ ఫ్లై పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసి గతంలో వచ్చిన 44వేల మెజారిటీ కంటే అధికంగా వచ్చేలా చూడాలని కోరారు.  
కార్యక్రమంలో మార్కెట్‌యార్డు కమిటీ వైఎస్‌ ఛైర్మన్‌ రమణారెడ్డి, బద్వేలు మున్సిపల్‌ ఛైర్మన్‌ వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి, అడా ఛైర్మన్‌ గురుమోహన్, నాయకులు నల్లేరు విశ్వనాథరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అంకన గురివిరెడ్డి, చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, సీ బాష, బోడపాడు రామసుబ్బారెడ్డి, అందూరు రామక్రిష్ణారెడ్డి, గోపాలస్వామి, సాయిక్రిష్ణ, ప్రభాకర్‌రెడ్డి, శారదమ్మ, తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: (సీఎం జగన్‌ వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన వివరాలు..)

ఎన్ని ఇబ్బందులున్నా హామీల అమలు.. 
ఎన్ని ఇబ్బందులున్నా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాల హామీలను నెరవేరుస్తున్నారని, ఈ విషయాన్ని ఓటర్లకు తెలియజేయాలని  మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రభుత్వం ద్వారా వారికి జరిగిన మేలు, అందిన సంక్షేమ పథకాలను వివరించి వారితో పార్టీ అభ్యర్థి డాక్డర్‌ సుధకు ఓట్లు వేసేలా చూడాలన్నారు.  

అందరూ సహకారం అందించాలి.. 
బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సుధ మాట్లాడుతూ గతంలో తన భర్త  డాక్టర్‌ వెంకటసుబ్బయ్య పోటీ చేసిన సమయంలో నాయకులు, కార్యకర్తలు కష్టించి పని చేశారని, అలాంటి సహకారం తనకు అందించాలని విన్నవించారు.  
 
టీడీపీని ఛీ కొట్టినా... 
2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఛీ కొట్టినా ఎల్లోమీడియా అండతో తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కడప మేయర్‌ సురేష్‌బాబు పేర్కొన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో 85 శాతం స్థానాలు సాధించినా... జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో 98 శాతం సాధించినా ... మున్సిపాలిటీ ఎన్నికల్లో 100 శాతం విజయాలు సాధించినా.. ప్రజలు ఎన్ని పర్యాయాలు వారికి బుద్ధి చెప్పినా వారి కుతంత్రాలు ఆగడం లేదన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి టీడీపీ కుట్రలకు అడ్డు వేసి ప్రజా కోర్టులో శిక్షిద్దామన్నారు.  


గోపవరంలో నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

పథకాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలి: ఎమ్మెల్యే చెవిరెడ్డి 
గోపవరం : బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సుధను మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మండల ఇన్‌చార్జి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దగోపవరంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.  అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు.  చదవండి: (‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ –జగనన్న స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభం)

ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటింగ్‌ శాతం పెరిగేలా చూసుకోవాలన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. శనివారం నుండి గ్రామ పంచాయతీల వారీగా  ప్రచారం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గోపవరం మల్లికార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ సరస్వతి, సర్పంచ్‌లు వెంకటలక్షుమ్మ, నాగేంద్ర, మల్లెం కొండేశ్వరస్వామి చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, నాయకులు వెంకటసుబ్బయ్య, శివారెడ్డి, హరికృష్ణారెడ్డి, సుందర్‌రామిరెడ్డి, కామిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ తిరుపాల్, మాజీ సర్పంచ్‌ వెంకటసుబ్బయ్య, హనుమంతు రమణ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు