సీఎం జగన్‌ వ్యక్తి కాదు.. వ్యవస్థ

31 Oct, 2020 11:49 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యలు విచారకరమని, ముఖ్యమంత్రి కేసులకు భయపడే వ్యక్తి కాదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన సోనియాను ఒకప్పుడు ఆయన ఎదుర్కొన్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలవరం విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయలేదు.  సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించైనా పోలవరాన్ని పూర్తి చేస్తాం. సీఎం జగన్‌ను ఉండవల్లి నువ్వు అని సంబోధించడం సరికాదు. ( 'చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలు పెట్టాడు' )

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ. మీకు చెప్పే స్థాయి కాదు.. మీ పై ఉన్న గౌరవంతో మాత్రమే మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగేళ్లు పాలన చేయాల్సి ఉంది. తెలంగాణ, ఢిల్లీలో ఉన్న పరిస్థితి వేరు. వారికి బీజేపీయే ప్రత్యర్థి. టీడీపీ హయాంలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీయే వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంత వాసులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ త్వరితగతిన పూర్తి చేసి పోలవరం విషయంలో ముందుకు వెళ్తా’’ మన్నారు.

ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి? : శివరామ సుబ్రమణ్యం
‘‘సీఎం జగన్ ప్రభుత్వంపై, చేపడుతున్న కార్యక్రమాలపై అవాకులు, చవాకులు విసురుతున్నారు.‌ ఉండవల్లి.. మీ స్ట్రాటజీ ఏంటి?. ప్రజలను గందరగోళ పరచడానికి ప్రయత్నిస్తున్నారా?. వైఎస్సార్‌ హయాంలో కేంద్రం నిధులు రాకపోయినా కాలువ పనులు పూర్తి చేయలేదా?. టీడీపీ హయాంలో టెండర్లలో అవకతవకలు జరిగాయి కదా!. సీఎం జగన్ కేసులకు భయపడుతున్నారని వ్యాఖ్యానించడాన్ని తప్పు పడుతున్నాం. సోనియాను ఎదిరించి పార్టీ పెట్టి విజయం సాధించారు. ఆయనపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అటువంటి వ్యక్తిని కేంద్రంతో లాలూచీపడున్నాడనడం సరికాదు. రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్షంలా చూడమంటారా?. రాష్ట్రంలో మరో  మూడు దశాబ్దాల వరకు బీజేపీకి మనుగడ ఉండదు. గతంలో అరుణ్  జైట్లీ,  చంద్రబాబుకు రహస్య ఒప్పందం ఉందని చెప్పింది మీరు కాదా?. చంద్రబాబును కలిశాక మీరు ఏం మాట్లాడుకున్నారు.. మీ మాటల్లో మీకు క్లారిటీ ఉందా? ఎవరు మీతో మాట్లాడిస్తున్నారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు