ఎంపీ దుర్గాప్రసాద్‌ అంత్యక్రియలు పూర్తి

17 Sep, 2020 13:25 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన బుధవారం సాయంత్రం  చెన్నైలో మరణించగా.. గురువారం ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం కాంపాలెంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. (చదవండి: అజాత శత్రువుగా అందరివాడయ్యారు..)

ఇటీవల దుర్గాప్రసాద్‌ స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స కోసం మూడు వారాల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత కరోనా నెగిటివ్‌ నిర్ధారణ అవ్వగా,  అయితే రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా సెప్టిసీమియా అనే వ్యాధి బారినపడ్డారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేయగా, ఆ సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ
తాడేపల్లి: తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌రావు అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు శంకర్ నారాయణ, అనిల్ కుమార్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. (చదవండి: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూత

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు