విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మేం అండగా ఉన్నాం 

14 Jul, 2021 10:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షా శిబిరానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బుధవారం సందర్శించారు. కార్మికుల ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. '' స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ అండగా ఉంది. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం' అని తెలిపారు.
 

మరిన్ని వార్తలు