పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

24 May, 2022 19:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రజల విజ్ఞప్తి మేరకే కోనసీమకు డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయి. ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేడ్కర్‌ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలి.

బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు. అంబేడ్కర్‌ పేరు పెట్టుకోవడం మన అదృష్టం. ఉద్యమకారులు సంయమనం పాటించండి. అంబేడ్కర్‌ వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లుతోంది. మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన పాకిస్తాన్‌లో రాజ్యాంగం ఫెయిల్‌ అయిందని ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. 

చదవండి 👇

ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. స్పందించిన మంత్రి విశ్వరూప్‌

అమలాపురానికి అదనపు బలగాలు
కోనసీమ: అమలాపురంలో విధ్వంసం కొనసాగుతోంది. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లాల నుంచి అదనపు బలగాలు తరలిస్తున్నారు. ఇంకా రోడ్లపై వేలాదిమంది ఆందోళనకారులు ఉన్నారు. ఆందోళన విరమించి వెళ్లి పోవాలని నిరసనకారులను పోలీసులు కోరుతున్నారు. 

చదవండి 👇

(Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి)

మరిన్ని వార్తలు