‘దేశంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఏపీ’

20 Nov, 2022 13:22 IST|Sakshi

సాక్షి, ఏలూరు: దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు ఇంకా లభించలేదు. 45 ఏళ్ల పోరాటం ఫలితంగా విద్యాహక్కు సాధించాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య అన్నారు. 

కాగా, కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో 30 లక్షల మంది బీసీ విద్యార్థులకు  ప్రయోజనం కలిగింది. బీసీలకు కూడా జనాభా ప్రకారం 56 శాతం రిజర్వేషన్‌కు పెంచాలి. దేశంలో 16 రాష్ట్రాల నుండి కనీసం ఒక్క ఎంపీ కూడా లేదు. బీసీల బిల్లు ఆమోదానికి దేశంలో అన్ని పార్టీలు పార్లమెంట్‌లో మద్దతివ్వాలి. 

బీసీలు భరత మాత ముద్దు బిడ్డలు. జనాభా ప్రాతపదికన మా వాట మాకు కావాలి. ఈ నెల 24 ఛలో ఢిల్లీకి పిలుపునిస్తున్నాము. దేశంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఏపీనే. దేశంలో ఎక్కడా లేని పథకాలు బీసీలకు ఇచ్చారు . మంత్రి పదవులు ఇచ్చారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బీసీలను ఓటర్లుగా చూస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌ సొంత మనుషుల్లా చూశారు అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు