‘బినామీల గావుకేకలకు ఏడాది అవుతోందట’

14 Dec, 2020 18:50 IST|Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యగ్యాస్త్రాలు సంధించారు. ‘‘టూరిస్టు బాబుగారు ఏపీలో 2 రోజులు ఉండేలా వస్తున్నారు.. పునాది వేసి సమాధిగా మార్చిన ప్రాంతాన్ని రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంట్ లేకుండా పంచానంటున్న రైతుల ప్లాట్లను చూపించి కన్నీళ్లు కార్చటానికి ఆయన, తమ భూముల రేట్లు తగ్గటానికి వీల్లేదని బినామీలు పెట్టే గావు కేకలకు ఏడాది అవుతోందట’’ అంటూ ట్వీట్‌ చేశారు. (చదవండి: తప్పుడు ప్రచారాలపై సీఎం జగన్‌ ఆగ్రహం)

టూరిస్ట్‌ చంద్రబాబు: ఎంపీ నందిగం సురేష్‌
తాడేపల్లి:
‘అమరావతికి వచ్చిన టూరిస్ట్‌ చంద్రబాబు’ అంటూ ఎంపీ నందిగం సురేష్‌ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకి అమరావతిపై ఆరాటం తప్ప.. పోరాటం కాదు. చంద్రబాబు బినామీల ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈ ఉద్యమం. పేద, బడుగు, బలహీన ప్రజలకు అమరావతిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్యం భూములు కేటాయిస్తే కోర్టుకి వెళ్లారు. అమరావతి ప్రాంతంలో డెమో గ్రాఫిక్ అభివృద్ధి దెబ్బతింటుంది అని చెప్పడం చంద్రబాబు బుద్దిని బయటపెట్టింది. కూడబెట్టుకున్న ఆస్తులు సంరక్షణ కోసం తాపత్రయం తప్ప అమరావతి మీద ప్రేమ కాదు. నాలుగు సంవత్సరాలు అంబేద్కర్ విగ్రహం కట్టడానికి మనసు రాలేదు.. కానీ దళితులకు న్యాయం చేస్తారట’’ అంటూ ఎంపీ సురేష్‌ దుయ్యబట్టారు. (చదవండి: మన్యంలో మావోయిస్టుల ఘాతుకం)

మరిన్ని వార్తలు