‘చిట్టినాయుడి కామెడీకి స్టాప్ గేట్లు ఉండవు’

10 Aug, 2021 13:15 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( ఫైల్‌ ఫోటో )

ట్విట్టర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: ట్విట్టర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రాజకీయాలను సర్కస్‌తో పోల్చడం కొత్తేమీకాదు. కాకపోతే సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్లు రాజకీయాల్లో ఉంటే నాన్ స్టాప్‌ కామెడీనే’ అంటూ ఆయన చలోక్తులు విసిరారు. ‘మోకాల్లోతు నీళ్లల్లో లైఫ్ జాకెట్‌తో దిగి లోకేష్ అనే బఫూన్‌ హాస్యం పండిస్తున్నాడు. చిట్టినాయుడి కామెడీకి స్టాప్ గేట్లు ఉండవంటూ’’ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

 

మరిన్ని వార్తలు