సోషల్‌ మీడియా కార్యకర్తలను విస్మరించం..

1 Dec, 2020 20:20 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను పార్టీ ఎప్పుడు విస్మరించదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి సోషల్‌ మీడియా ఎంతోగానో కృషి చేసిందని తెలిపారు. విజయవాడలో జరిగిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేష్, ఏపీఎస్ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. (చదవండి: బాబుకు నరకంలో కూడా చోటు దొరకదు: సీఎం జగన్)‌

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ హయాంలో పెట్టిన కేసులు 67 కేసులను కొట్టివేయించామని, మిగతా కేసుల్లో ఉద్దేశ్యపూర్వకంగా నమోదు చేసిన వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. సభ్యులకు కమిటీలు ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్న ఏ కార్యకర్తకు కూడా అన్యాయం జరగదన్నారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. (చదవండి: సీఎం జగన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత..)

న్యాయం చేస్తాం: ఎంపీ మోపిదేవి
మేనిఫెస్టోలో పెట్టిన, పెట్టని ఎన్నో ప్రయోజనాలను ప్రజలకి అందిస్తున్నామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలిసేవిధంగా సోషల్ మీడియా బాగా పనిచేస్తోందని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా సభ్యులకు న్యాయం చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

సోషల్‌ మీడియా పాత్ర అమోఘం: పార్థసారధి
వైఎస్సార్‌సీపీ గెలుపులో సోషల్‌ మీడియా పాత్ర అమోఘం అని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. వైఎస్సార్‌సీపీ గెలుపునకు ఎంతో కృషి చేశారని తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుందని, కొన్ని పత్రికలు దురుద్దేశ్యంతో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.

సోల్జర్స్‌గా పనిచేశారు: జోగి రమేష్‌
సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావటం కోసం సోషల్‌ మీడియా సభ్యులు సోల్జర్స్‌గా పనిచేశారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. వైఎస్సార్‌సీపీ కోసం పడిన కష్టాలు తమకు గుర్తుకు ఉన్నాయని, అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు