వైఎస్సార్‌సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం: బీసీలంతా ఐక్యంగా ఉంటేనే పనులు సాధించొచ్చు

26 Oct, 2022 15:27 IST|Sakshi

సాక్షి, గుంటూరు: బీసీ సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, బీసీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో బుధవారం జరిగిన వైఎస్సార్‌సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఆయన ప్రసంగించారు. 

139 కులాలతో బీసీలు ఉన్నారు. అందరూ ఏకతాటి మీద నిలబడాలి. కొన్ని కులాలు విడిపోయి ఇతర కులాల్లో చేర్చాలనే డిమాండ్ చేయటం వలన ప్రయోజనం ఉండదు. ఐకమత్యంతో ఉంటేనే ఏవైనా పనులు సాధించవచ్చు. చట్టసభల్లో కూడా 50% మహిళకు అవకాశం కల్పించేలా బిల్లు తేవాలి అని విజయసాయిరెడ్డి మాట్లాడారు. 
  
బీసీల సంక్షేమానికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని, కార్పొరేషన్‌ పదవుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

ఇదీ చదవండి: తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం

మరిన్ని వార్తలు