పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

10 Aug, 2021 14:34 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, ఢిల్లీ: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు మరో సభ్యుడిగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ శర్మ.. పార్లమెంట్‌ బులిటెన్‌ విడుదల చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించనుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు